నెట్‌ఫ్లిక్స్‌లోకి ఓజీ... ఎప్పటి నుంచంటే...

October 15, 2025


img

సుజీత్ దర్శకత్వంలో సెప్టెంబర్‌ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘ఓజీ’ ఇటు పవన్‌ కళ్యాణ్‌కి చాలా ఉపశమనం కలిగించింది. అభిమానులు పవన్‌ కళ్యాణ్‌ని ఏవిదంగా చూడాలనుకుంటారో దర్శకుడు సుజీత్ సరిగ్గా అలాగే చూపించడంతో వారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. 

రాజకీయాలలో బిజీగా మారిన పవన్‌ కళ్యాణ్‌ ఇక సినిమాలు చేయడం మానేయాలనుకున్నారు. కానీ ‘ఓజీ’ సూపర్ హిట్ అవడం, ముఖ్యంగా అభిమానులు చాలా సంతోష పడుతుండటంతో ఓజీకి సీక్వెల్‌ చేసేందుకు సిద్దమని పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించారు.  

కనుక ఓజీ కోసం ఓటీటీ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇంకా నెల రోజులు గడువు పూర్తి కానందున దీపావళికి (అక్టోబర్‌ 20న) వచ్చే అవకాశం లేదు. కానీ పండగ తర్వాత అంటే అక్టోబర్‌ 23న నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో రాబోతున్నట్లు తెలుస్తోంది. 

 పవన్‌ కళ్యాణ్‌, ప్రియాంక మోహన్ జంటగా చేసిన ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించారు. శుభలేఖ సుధాకర్, ప్రకాష్ రాజ్, అజయ్ ఘోష్, అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి, హరీష్ శంకర్‌ ఉత్తమన్, అభిమన్యు సింగ్‌ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకి కధ, దర్శకత్వం: సుజీత్, సంగీతం: థమన్; కెమెరా: రవి కె చంద్రన్; ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు. 


Related Post

సినిమా స‌మీక్ష