రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో అక్టోబర్ 2న విడుదలైన ‘కాంతార: ఛాప్టర్ 1’ ఊహించినట్లే సూపర్ హిట్ అయ్యింది. కనుక ఇక నేడో రేపో ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటిస్తారనుకుంటే దీపావళి పండుగకి మరో ట్రైలర్ విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది హోంబలే ఫిలింస్.
సినిమా విడుదలైన తర్వాత మరో ట్రైలర్ విడుదల చేయడం ఆశ్చర్యం కలిగించినప్పటికీ ఇది ఇంకా ఈ సినిమా చూడని ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలదు. కనుక ఇది మంచి ఆలోచనే.
‘కాంతార: ఛాప్టర్ 1’లో రిషబ్ శెట్టికి జంటగా రుక్మిణీ వసంత్ నటించగా జయరాం, రాకేశ్ పూజారి తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రిషబ్ శెట్టి; సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్; సినిమాటోగ్రఫీ: అరవింద్ ఎస్ కశ్యప్ చేశారు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ‘కాంతార: ఛాప్టర్ 1’ నిర్మించారు.