వెంకటేష్, రానా తప్పనిసరిగా కోర్టుకి రావాల్సిందే!

October 16, 2025
img

ఫిల్మ్ నగర్‌లో దక్కన్ కిచన్ హోటల్ కూల్చివేత కేసులో నాంపల్లి కోర్టు దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా, నిర్మాత సురేష్ బాబు, అభిరామ్‌లకు ఊహించని షాక్ ఇచ్చింది. ఈ కేసులో ఆ నలుగురు నవంబర్‌ 14న కోర్టు విచారణకు హాజరయ్యి వ్యక్తిగత బాండ్స్ సమర్పించాలని ఆదేశించింది.

దక్కన్ కిచన్ హోటల్ భూవివాదంలో చిక్కుకోవడంతో దానిపై తుదితీర్పు వేలువరిచే వరకు యధాతథ స్థితి కొనసాగించాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. కానీ దగ్గుబాటి కుటుంబ సభ్యులు కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా దక్కన్ కిచన్ హోటల్‌ని జేసీబీతో పాక్షికంగా కూల్పించేశారు. వారిపై సదరు హోటల్ యజమాని నాంపల్లి కోర్టులో కేసు వేశారు. ఆ కేసులోనే వ్యక్తిగత బాండ్స్ సమర్పించాలని, వాటిని సమర్పించేందుకు వారు స్వయంగా కోర్టుకు రావాలని ఆదేశించింది. 

Related Post