జైన్స్ నాని దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా చేసిన ‘కె-ర్యాంప్’ శనివారం విడుదల కాబోతోంది. కనుక ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్, సారధి స్టూడియోస్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గోనాలనుకునేవారు ఉచిత పాసుల కోసం https://shreyas.media/kr లేదా www.shreyasgroup.net ఆన్‌లైన్‌లో పొందవచ్చు.
ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సీనియర్ నరేష్, సాయి కుమార్, అలీ, మురళీధర్ గౌడ్, చంద్రిక, రవి, విమలా రామన్, మెర్సీ జాయ్, కామ్నా జట్మలానీ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: జైన్స్ నాని, సంగీతం: చేతన్ భరద్వాజ, కెమెరా: సతీష్ రెడ్డి మాసం, ఆర్ట్: సుధీర్ మాచర్ల, ఎడిటింగ్: ఛోటా కే ప్రసాద్ చేశారు.
హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ నిర్మించిన కే-ర్యాంప్ అక్టోబర్ 18న విడుదల కాబోతోంది.