జటాధరా ట్రైలర్‌...

October 17, 2025


img

వెంకట్‌ కల్యాణ్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా చేస్తున్న ‘జటాధర’ ట్రైలర్‌ నేడు విడుదలైంది. దయ్యాలు, భూతాలు లేవని నమ్మే హీరో, ఓ గుప్తనిధికి కాపలా కాస్తున్న ధన పిశాచిని ఎదుర్కోవడం, సైన్సుకి అతీతమైన శక్తులు ఉన్నాయని చివరికి గ్రహించడం ట్రైలర్‌లో చూపారు. అంటే సినిమా కధ మొత్తం చెప్పెశారనే అనుకోవచ్చు. తెలుగు ప్రేక్షకులు అరుంధతి వంటి సినిమాలు చాలానే చూశారు. కనుక ఈ ధనపిశాచిని ఆదరిస్తారో లేదో చూడాలి.        

తొలిసారిగా తెలుగులో నటిస్తున్న బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షి సిన్హా ధన పిశాచి పాత్ర చేసేందుకు ఒప్పుకోవడం విచిత్రంగానే ఉంది. కానీ ఒంటి నిండా బంగారు ఆభరణాలతో ఆమెలో రాజసం ఉట్టిపడుతోంది. 

జటాధరలో రైన్ అంజలి, శిల్పా శిరోడ్కర్, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, ఝాన్సీ, శ్రేయ శర్మ, నవీన్ నేని, ఇందిరా కృష్ణ రవి ప్రకాష్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

జీ స్టూడియో బ్యానర్‌పై ఉమేశ్‌ కె.ఆర్‌.భన్సాల్, ప్రేరణ అరోరా కలిసి నిర్మిస్తున్న జటాధరకు కధ: వెంకట్ కళ్యాణ్, దర్శకత్వం: వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ చేశారు. నవంబర్‌ 7న జటాధర విడుదల కాబోతోంది.

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/0GRwVCILAEA?si=oQ9E9bsqnx6V8WxS" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

Related Post

సినిమా స‌మీక్ష