ప్రముఖ క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివబా జడేజా గుజరాత్ మంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. గుజరాత్ బీజేపి ప్రభుత్వంలో వ్యవస్థాగత మార్పుల కోసం గురువారం సిఎం భూపేంద్ర పటేల్ మినహా మిగిలిన మంత్రులు అందరూ అధిష్టానం ఆదేశం మేరకు తమ పదవులకు రాజీనామాలు చేశారు. వారి స్థానంలో నేడు 26 మందిని మంత్రులను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వారిలో రవీంద్ర జడేజా సతీమణి రివబా జడేజా ఒకరు. నేడు గాంధీ నగర్‌లో ఆమెతో సహా 26 మంది మంత్రులు ప్రమాణ స్వీకారాలు చేశారు.
రివబా జడేజా గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో 19౯౦లొ జన్మించారు. మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. 2016లో రవీంద్ర జడేజాని వివాహం చేసుకున్నారు. 2019లో బీజేపిలో చేరి 2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలలో జామ్ నగర్ నుంచి పోటీ చేసి గెలిచి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు మంత్రిగా మరో మెట్టు ఎక్కారు.