కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి కొండా సురేఖ వివాదం, ఆమె కుమార్తె కొండా సుస్మిత సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులపై చేస్తున్న విమర్శలతో ముదిరి పాకాన పడుతోంది.
“మా అమ్మ నియోజకవర్గంలో జరగాల్సిన పనుల కోసం వినతి పత్రాలు పట్టుకొని సిఎం రేవంత్ రెడ్డి దగ్గరకు వెళ్ళినప్పుడు ఎన్ని వినతి పత్రాలు ఇస్తావంటూ అయన మా అమ్మపై అసహనంతో విరుచుకుపడేవారు. అప్పుడు మా అమ్మ ఇంటికి వచ్చి ఆ విషయం చెప్పుకొని కన్నీళ్ళు పెట్టుకునేవారు.
ఇలా ఒకసారి రెండుసార్లు కాదు చాలా సార్లు జరిగింది. కానీ ఆమె కానీ నేను గానీ ఈ విషయం ఎన్నడూ ఎవరికీ చెప్పలేదు.
బీఆర్ఎస్ పార్టీ హయంలోనే మా కుటుంబం చాలా ప్రశాంతంగా ఉండేది. కానీ ఇప్పుడు మా సొంత పార్టీయే అధికారంలో ఉన్నప్పుడు మాకు ఈ ఈసడింపుపు, అవమానాలు ఎదుర్కోవలసి వస్తోంది.
సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముగ్గురూ మా అమ్మపై పగబట్టినట్లు వ్యవహరిస్తున్నారు. ఇది నాకు చాలా బాధ కలిగిస్తోంది. అందుకే నేను మీడియా ముందుకు వచ్చి ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నాను,” అని కొండా సుస్మిత ఆవేదన వ్యక్తం చేశారు.
తమ కుమార్తె సుస్మితకు పార్టీతో, ప్రభుత్వంతో, రాజకీయాలతో ఎటువంటి సంబంధమూ లేదని కొండ మురళి చెప్పినప్పటికీ, ఆమె చేస్తున్న విమర్శలు రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలకు మరింత ఆగ్రహం కలిగిస్తాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ కీలక సమయంలో ఇటువంటివి ఎన్నికలలో పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తాయి. కనుక మంత్రి కొండా సురేఖ ఎంత వివరణ ఇచ్చుకున్నప్పటికీ, సుస్మిత చేస్తున్న ఈ విమర్శలు కొండా దంపతులకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.
రేవంత్ రెడ్డి మా అమ్మను చాలా సార్లు నోటికి ఇష్టమొచ్చినట్లు అసహనంగా మాట్లాడేవాడు.. మా అమ్మ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకునేది
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే మేము ప్రశాంతంగా ఉన్నాం.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మా మీదే కుట్రలు చేస్తున్నారు
రేవంత్ రెడ్డి ఒకడు, పొంగులేటి ఒకడు, వేం… https://t.co/3lGUrZrDd0 pic.twitter.com/aoOxErtqUc