మరో సినిమాకి చిరంజీవి అప్పుడే రెడీ!

October 17, 2025


img

ప్రభాస్, అల్లు అర్జున్‌, మహేష్ బాబు వంటి యువనటులు ఏళ్ళ తరబడి ఒక్కో సినిమా చేస్తుంటే నాలుగు దశాబ్దాలు పైగా సినీ పరిశ్రమలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఒక ఏడాదిలో రెండు మూడు సినిమాలు మొదలుపెట్టేస్తున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడితో ‘మన శంకర వరప్రసాద్ గారు' సినిమా మొదలుపెట్టి అప్పుడే సగం పూర్తి చేశారు. 

అది పూర్తికాక మునుపే మళ్ళీ బాబి దర్శకత్వంలో మరో సినిమాకి కొబ్బరికాయ కొత్తబోతున్నారు. నవంబర్‌ 5న ఈ సినిమా పూజా కార్యక్రమం చేయబోతున్నారు. అనిల్ రావిపూడి సినిమా పూర్తి చేయగానే అది మొదలుపెట్టేస్తారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మాళవికా మోహన్ స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. పూజా కార్యక్రమం జరిగితే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు బయటకు వస్తాయి. 

 ‘మన శంకర వరప్రసాద్ గారు... పండగకి వస్తున్నారు’ అని టైటిల్‌లోనే చెప్పేశారు కనుక రిలీజ్ డేట్ ముందే లాక్ చేసేశారు. ఈ సినిమాలో చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమాకు కధ, దర్శకత్వం: అనిల్ రావిపూడి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: సమీర్ రెడ్డి, ఎడిటింగ్: తమ్మిరాజు చేస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష