‘జాతి రత్నాలు’ దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ చేస్తున్న ‘ఫంకీ’ టీజర్ ఇటీవల విడుదల చేయగా అందరినీ అలరించింది. సినిమాపై అంచనాలు పెంచేసింది.
ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఓ సినీ దర్శకుడుగా నటిస్తుండగా, హీరోయిన్ కాయడు లోహర్ ఆ సినీ నిర్మాతగా నటిస్తున్నారు. నిర్మాత, దర్శకుడు ప్రేమలో పడితే ఆ సినిమా ఎలా ఉంటుందో ఆ కామెడీకి, రోమాన్స్ ఎలా ఉంటుందో టీజర్ చూస్తేనే అర్ధమవుతుంది. ఇక సినిమా ఎలా ఉంటుందో? అంటే డిసెంబర్ 25వరకు ఆగాల్సిందే అంటున్నారు నిర్మాత నాగ వంశీ. క్రిస్మస్ పండగకి సినిమా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట!
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: అనుదీప్, సంగీతం: భీమ్స్ సీసీరిలియో, కెమెరా: సురేష్ సంగం, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు.