ఎల్లమ్మతో దేవిశ్రీ ప్రసాద్... సంగీతం కాదు

October 17, 2025


img

వేణు ఎల్దండి దర్శకత్వంలో వచ్చిన ‘బలగం’ సూపర్ హిట్ అవడంతో తర్వాత సినిమా కోసం అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ వేణు ఎల్దండి తొందరపడి ఏదో ఓ సినిమా తీసేయాలనుకోలేదు. మళ్ళీ తెలంగాణ నేపధ్యంతోనే మరో బలమైన కధ సిద్దం చేసుకొని ‘ఎల్లమ్మ’ సినిమా ప్రకటించారు.

ఈ సినిమాలో నితిన్ హీరోగా నటిస్తున్నారు. అయనకు జంటగా సాయి పల్లవి నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి కానీ కీర్తి సురేష్‌ని తీసుకున్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా సినిమాలలో నటించాలని ఉవ్విళ్ళూరుతున్న ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్ర చేయబోతున్నట్లు, అందుకు ఆయనకు రూ.5 కోట్లు పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. కానీ ఈ వార్తని ఇంకా ద్రువీకరించాల్సి ఉంది.      

శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష