రేపు కర్నూలులో పర్యటించనున్న ప్రధాని మోడీ

October 15, 2025
img

ప్రధాని మోడీ రేపు కర్నూలులో పర్యటించనున్నారు. గురువారం ఉదయం 7.20 గంటలకు ఢిల్లీ నుంచి భారత్‌ వాయుసేనకు చెందిన ఐఏఎఫ్ ఎంబ్రార్ విమానంలో బయలుదేరి 9.50 గంటలకు కర్నూలులోని ఓర్వకల్ విమానాశ్రయం చేరుకుంటారు. 

అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో శ్రీశైలం చేరుకొని శ్రీ మల్లేశ్వరస్వామి పూజలలో పాల్గొంటారు. తర్వాత అక్కడే ఉన్న చత్రపతి శివాజీ మహారాజ్ దర్బార్ హాల్, ధ్యాన మందిరం సందర్శిస్తారు. భ్రమరాంభ అతిధి గృహంలో భోజన విరామం తర్వాత రాగ మయూరీ గ్రీన్ సిగ్నల్‌ హిల్స్, నన్నూరు గ్రామ సమీపంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సభ ముగిసిన తర్వాత సాయంత్రం 4.40 గంటలకు హెలికాఫ్టర్‌లో ఓర్వకల్ విమనాశ్రయం చేరుకొని ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.      

Related Post