పారలింపిక్స్‌లో రజతం సాదించిన మోనా అగర్వాల్

August 31, 2024
img

పారిస్‌లో జరుగుతున్న పారలింపిక్స్‌లో భారత్‌ షూటర్ అవని లేఖర 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (ఎస్‌హెచ్-1) ఈవెంట్‌లో 249.7 పాయింట్లు సాధించి స్వర్ణం సాధించగా, మరో షూటర్ మోనా అగర్వాల్ 228.7 పాయింట్లతో కాంస్యం సాధించారు. 

రాజస్థాన్‌కి చెందిన మోనా అగర్వాల్ ఓ నిరుపేద కుటుంబంలో పుట్టారు. తొమ్మిది నెలల వయసులోనే పోలియో వ్యాధితో రెండు కాళ్ళు చచ్చుబడిపోయాయి. పసిప్రాయం నుంచే దుర్భరం జీవితం గడిపిన మోనాకి అంగవైకల్యం కలిగిన బాస్కెట్ బాల్ ప్లేయర్ రవీంద్ర చౌదరితో వివాహం జరిగింది. కానీ ఓ ప్రమాదంలో ఆమె భర్త గాయపడి మంచాన్న పడ్డాడు. 

అయితే అతనే ఈ పారలింపిక్స్‌ గురించి మోనాకు చెప్పి ప్రోత్సాహించడంతో మోనా అగర్వాల్ తనకు సరిపడే వివిద క్రీడలలో ప్రయత్నించి చివరికి షూటింగ్‌ ఎంచుకుని ప్రాక్టీస్ చేయడం ప్రారంభించింది. కుటుంబ పోషణ భారం మోస్తూనే షూటింగ్ శిక్షణ కోసం డబ్బు సమకూర్చుకోక తప్పలేదు. అయితే ఎన్ని కష్టాలు, ఎన్ని ఆర్ధిక సమస్యలు వచ్చినా క్రుంగిపోకుండా అన్నిటినీ పంటి బిగువున భరిస్తూ ముందుకే సాగి చివరికి పారలింపిక్స్‌లో భారత్‌కి రజత పతకం సాధించిపెట్టారు. 

అంతకు ముందు 2023లో క్రొయేషియాలో జరిగిన వరల్డ్ కప్‌ పోటీలలో కూడా పాల్గొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో దక్షిణ కొరియాలో జరిగిన వరల్డ్ కప్ పోటీలలో కూడా మోనా అగర్వాల్ పాల్గొని బంగారు పతకం సాధించారు. 

Related Post