పారిస్‌లో పారా ఒలింపిక్స్‌ ప్రారంభం

August 29, 2024
img

పారిస్‌లో పారాలింపిక్స్‌ ప్రారంభం అయ్యాయి. డీలా కాంకార్డ్ వేదికగా అట్టహాసంగా జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్ మీర్,  చెక్ రిపబ్లిక్ అధ్యక్షుడు పీటర్ పావెల్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

నేటి నుంచి 11 రోజుల పాటు సాగే ఈ పారాలింపిక్స్‌లో పాల్గొనేందుకు భారత్‌ నుంచి 84 మంది క్రీడాకారులు వెళ్ళారు. టోక్యోలో జరిగిన పారా ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన సుమిత్ అంటిల్, రజత పతక విజేత భాగ్యశ్రీ జాదవ్ ఈసారి పారాలింపిక్స్‌లో భారత్‌ క్రీడాకారులతో కలిసి జాతీయ జెండాతో పరేడ్ చేస్తారు. 

టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌ తరపున 54 మంది క్రీడాకారులు పాల్గొని 5 స్వర్ణాలతో సహా మొత్తం 19 పతకాలు సాధించారు. ఆ ఉత్సాహంతో ఈసారి 84 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు కనుక వారు భారత్‌కి మరిన్ని పతకాలు సాధిస్తారని ఆశిద్దాం.

Related Post