జనగామలో నకిలీ సాధువులు అరెస్ట్‌

October 23, 2025
img

జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో నలుగురు నకిలీ సాధువులను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వారు కాశీ నుంచి తెచ్చిన విభూది, రుద్రాక్షలు అంటూ స్థానిక వ్యాపారుల చేతిలో పెట్టి మొదట రూ.10 లేదా 50 అడిగి తీసుకొని తర్వాత విభూది అంటూ మత్తు కలిగించే పౌడర్ వారిపై జల్లి మరో రూ.500 ఇమ్మనమని అడుగుతున్నారు. ఆ మైకంలో ఉన్న వ్యాపారులు వారు అడిగినంత డబ్బు ఇచ్చేస్తున్నారు.

ఆ నలుగురు నకిలీ సాధువులు ఇలా వరుసగా నాలుగైదు దుకాణాలలో డబ్బు దండుకొని అక్కడి నుంచి కారులో వెళ్ళిపోతుండగా స్థానికులకు అనుమానం వచ్చి వారిని అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. జనగామ పోలీసులు వారిని అదుపులో తీసుకొని స్టేషన్‌కి తరలించి విచారిస్తున్నారు. 

ఆ వ్యాపారులలో ఒకరు మీడియాకు ఆ దొంగ సాధువులు తమకు ఇచ్చిన నకిలీ రుద్రాక్షని చూపించి, వారు తమని ఏవిదంగా మోసగించారో వివరించారు. సాధువుల వేషంలో వచ్చి ఇటువంటి మోసాలు చేస్తున్నవారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.


Related Post