జూబ్లీహిల్స్‌ నామినేషన్స్: నేడే చివరి రోజు

October 21, 2025


img

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల నామినేషన్స్ గడువు నేటితో ముగియనుంది. రెండు ప్రధాన పార్టీలు కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలతో కలిపి ఇప్పటి వరకు 127 నామినేషన్స్ దాఖలయ్యాయి.  నేడు బీజేపి అభ్యర్ధి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. నేటితో గడువు ముగియనుంది కనుక మరికొన్ని నామినేషన్స్ దాఖలయ్యే అవకాశం ఉంటుంది.

రేపు (బుధవారం) నామినేషన్స్ పరిశీలన, నామినేషన్స్ ఉప సంహరణ గడువు అక్టోబర్‌ 24, పోలింగ్ నవంబర్‌ 11, ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలు: నవంబర్‌ 14న వెలువడతాయి.     

ఈ ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా నవీన్ యాదవ్‌, బీఆర్ఎస్‌ పార్టీ తరపున మాగంటి సునీత, పి. విష్ణువర్ధన్ రెడ్డి, బీజేపి అభ్యర్ధిగా లంకల దీపక్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. వీరిలో నవీన్ యాదవ్‌కు మజ్లీస్ పార్టీ, కొందరు సినీ నటులు మద్దతు తెలిపారు. 



Related Post