ఎల్లమ్మలో హీరోయిన్‌ కీర్తి సురేష్‌... కానీ హీరో నితిన్ కాదు!

October 19, 2025


img

వేణు ఎల్దండి దర్శకత్వంలో తీస్తున్న ఎల్లమ్మ సినిమాలో ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ నటించబోతున్నారనే వార్తే సంచలనం అనుకుంటే ఈ సినిమాలో కీర్తి సురేష్‌ అతనికి జంటగా నటించబోతోందనే మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

తెలంగాణ గ్రామీణ నేపధ్యంతోనే తీస్తున్న ‘ఎల్లమ్మ’లో హీరోగా నితిన్ నటిస్తున్నారు కనుక కీర్తి సురేష్‌ అతనికి జంటగా నటిస్తారనుకుంటే దేవిశ్రీ ప్రసాద్‌కు జంటగా అనే వార్త అందరికీ ఆశ్చర్యం కలిగించేదే. ఈ సినిమాలో నటించేందుకు దేవిశ్రీ ప్రసాద్‌కి రూ.5 కోట్లు పారితోషికం ఇచ్చినట్లు సమాచారం.       

శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభిస్తామని దిల్‌రాజు చెప్పారు. 


Related Post

సినిమా స‌మీక్ష