ఈ నెల 25న హుజూర్ నగర్‌లో మెగా జాబ్ మేళా జరుగబోతోంది. నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఐటిఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, బీఫార్మసీ, ఎంబీఏ తదితర విద్యార్హతలు కలిగి 18 నుంచి 40 ఏళ్ళలోపు వయసున్న వారందరికీ సరిపడా ఉద్యోగావకాశాలు ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొనే కంపెనీలలో లభిస్తాయి.
కనుక ఆసక్తి, అర్హత కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు పట్టణంలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం వెనుక గల పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూలలో అక్టోబర్ 25వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మెగా జాబ్ మేళాలో పాల్గొని తమ అదృష్టం పరీక్షించుకోవచ్చు.
ఈ మెగా జాబ్ మేళాలో సుమారు 150కి పైగా ప్రైవేట్ కంపెనీలు పాల్గొనబోతున్నాయి. కనుక వేర్వేరు కంపెనీలకు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా కనీసం ఓ అరడజను పాస్ పోర్టు సైజ్ ఫోటోలు, ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్, వాటికి కూడా అరడజను చొప్పున జిరాక్సు కాపీలతో వెళ్తే మంచిది.
అప్పుడు ఏదో ఓ కంపెనీలో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఈ మెగా జాబ్ మేళాలో అన్ని కంపెనీలు కలిపి సుమారు 5,000 మందిని భర్తీ చేసుకోబోతున్నాయి. సింగరేణి, తెలంగాణ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్‌చేంజ్ సహకారంతో ఈ మెగా జాబ్ మేళా జరుగుతోంది.
ఈ మెగా జాబ్ మేళాకు సంబంధించి మరింత సమాచారం కొరకు: 90000 937805, 98489 97050, 98484 09466 నంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.