తమిళనాడు ఎన్నికల వరాల జల్లులు షురూ

March 08, 2026


img

మరో రెండు నెలల్లోగా తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. కోలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసి టీవీకే పార్టీతో రాజకీయాలలోకి ప్రవేశించిన ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్‌ నిన్న పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేశారు. దానిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో సహా పలు హామీలు ఇచ్చారు. 

వెట్రి పయనం పధకం: మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం.

60 ఏళ్ళలోపు మహిళలకు నెలకు రూ.2,500 పించన్.

విద్యార్ధులకు ఏడాదికి రూ.15,000 ఆర్థికసాయం.

మహిళల రక్షణ కోసం ప్రత్యేక పోలీసు విభాగం.

అన్నపూరణి పధకం:  పేదలకు ఏటా ఉచితంగా 6 గ్యాస్‌ సిలిండర్లు

మహిళలపై నేరాల కేసులను త్వరగా పరిష్కరించడానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు. 

పెళ్ళి చేసుకోబోతున్న యువతులకు 1 గ్రాము బంగారం, పట్టుచీర. 

తాము ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వస్తే ఈ హామీలన్నీ అమలుచేస్తామని టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌ ప్రకటించారు.  


Related Post