నెట్‌ఫ్లిక్స్‌లోకి ఓజీ... అక్టోబర్‌ 23 నుంచి

October 18, 2025


img

సుజీత్ దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ హీరోగా చేసిన ఓజీ గత నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్, మంచి కలెక్షన్స్ కూడా సాధించింది. ఈ సినిమా తర్వాత ఇక కొత్తగా సినిమాలు చేయకూడదని, పూర్తి సమయం రాజకీయాలకే కేటాయించాలనుకున్నారు. కానీ ఓజీని అభిమానులు చాలా ఎంజాయ్ చేయడంతో దీనికి సీక్వెల్ కూడా చేస్తానని పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా ప్రకటించారు. 

ఓజీ నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలోకి రాబోతోందని రోజూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ నెల 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఓజీ ప్రసారం కాబోతోంది. ఈ విషయం నెట్‌ఫ్లిక్స్‌ స్వయంగా ప్రకటించింది. 

 పవన్‌ కళ్యాణ్‌, ప్రియాంక మోహన్ జంటగా చేసిన ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించారు. శుభలేఖ సుధాకర్, ప్రకాష్ రాజ్, అజయ్ ఘోష్, అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి, హరీష్ శంకర్‌ ఉత్తమన్, అభిమన్యు సింగ్‌ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకి కధ, దర్శకత్వం: సుజీత్, సంగీతం: థమన్; కెమెరా: రవి కె చంద్రన్; ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు.


Related Post

సినిమా స‌మీక్ష