రామాయణ, మహాభారతాలపై అన్ని భారతీయ భాషల్లో వందల సినిమాలు వచ్చాయి. అయినప్పటికీ కొత్తవి వస్తూనే ఉన్నాయి. ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉన్నారు. వాటికి అంత ఆదరణ ఉంది.
ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో మహాభారతంలోని కురుక్షేత్ర మహా సంగ్రామాన్ని, దాని నేపధ్యాన్ని, దానిలో చాలా మందికి తెలియని పాత్రలను, వారి కధలను తెలియజేస్తూ కురుక్షేత్ర అనే వెబ్ సిరీస్ వచ్చింది. అది చాలా అద్భుతంగా ఉంది. మంఛి జనాదరణ పొందింది. విశేషమేమిటంటే అదో యానిమేషన్ సినిమా!
అయినా కూడా కధ చెప్పిన తీరు, కధనం, పాత్రలు, యుద్ధ సన్నివేశాలు, గ్రాఫిక్స్, సంగీతం అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి.
ఉజాన్ గంగూలి దర్శకత్వంలో వచ్చిన ‘కురుక్షేత్ర’లో కురుక్షేత్ర యుద్ధం జరిగిన 18 రోజులలో ఏ రోజు ఏం జరిగింది? ఏవిదంగా జరిగింది?అలా ఎందుకు జరిగిందో చాలా చక్కగా చూపారు. మొదటి భాగంలో మొదటి 14 రోజుల వరకు జరిగిన యుద్ధాన్ని చూపారు.
ఇప్పుడు రెండో భాగంలో కీలకమైన మిగిలిన నాలుగు రోజుల యుద్ధం, తదనంతర పరిణామాలను, పర్యవసానాలను చూపబోతున్నారు. కురుక్షేత్ర రెండో భాగం ఈ నెల 24 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ప్రసారం కాబోతోంది. ఈ సందర్భంగా రెండో భాగం ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే తప్పకుండా ఇంతవరకు కురుక్షేత్ర-1 చూడనివారు కూడా చూస్తారు.