రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాద్‌తో కలిసి శనివారం లక్నోలోని బ్రహ్మోస్ క్షిపణి తయారీ కేంద్రంలో పర్యటించారు. ఇక్కడ తయారైన బ్రహ్మోస్ క్షిపణులను వారు భారత్ ఆర్మీకి అప్పగించారు.
ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ పాకిస్తాన్‌ని హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ, “ఆపరేషన్ సింధూర్ కేవలం ట్రైలర్ మాత్రమే. పాకిస్తాన్‌కి భారత్ జన్మనిచ్చింది. మనం తలుచుకుంటే ఏం చేయగలమో చెప్పక్కర లేదు. పాకిస్తాన్‌లో ప్రతీ అంగుళం బ్రహ్మోస్ పరిధిలో ఉంది. వాటి నుంచి పాక్ తప్పించుకోలేదు,” అని హెచ్చరించారు.
ఇటీవల అఫ్ఘన్ విదేశాంగశాఖ మంత్రి మవలావి అమీర్ షారూక్ ఖాన్ ముత్తాఖి ఇటీవల ఢిల్లీకి రావడం, భారత్ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సమావేశమవడంపై పాకిస్తాన్ చాలా గుర్రుగా ఉంది. భారత్ ప్రోద్బలంతోనే అఫ్ఘనిస్తాన్ తమపై దాడులు చేస్తోందని పాక్ ఆరోపిస్తోంది. కనుక భారత్, అఫ్ఘనిస్తాన్ రెండు దేశాలతో ఒకేసారి యుద్ధం చేసి ఓడించగల శక్తి సామర్ధ్యాలు తమ దేశానికి ఉన్నాయని ఇటీవల పాక్ మంత్రి అన్నారు. రాజ్‌నాథ్ సింగ్ అయన మాటలకు ఈవిదంగా జవాబు చెప్పారనుకోవచ్చు.
कभी उत्तर प्रदेश की पहचान गुंडाराज और बिगड़े लॉ एंड ऑर्डर से की जाती थी। आज का यूपी मुख्यमंत्री योगी आदित्यनाथ जी के नेतृत्व में बदल चुका है: रक्षा मंत्री श्री @rajnathsingh #BJP4ViksitBharat #BrahMosMissile #सशक्त_यूपी_सशक्त_भारत #BJP4UP pic.twitter.com/7oxLL356F9
— BJP Uttar Pradesh (@BJP4UP) October 18, 2025