పండగ సమయంలో బంద్‌.. బస్సుల్లేవ్

October 18, 2025


img

బీసీ రిజర్వేషన్స్‌ కోసం నేడు అధికార కాంగ్రెస్‌ పార్టీతో సహా రాష్ట్రంలో అన్ని పార్టీలు తెలంగాణ బంద్‌కు మద్దతు ప్రకటించి పాల్గొన్నాయి కనుక తొలిసారిగా బంద్‌ సంపూర్ణమైంది. సాధారణంగా బంద్‌ అంటే మధ్యాహ్నం 12 గంటల వరకే ఉదృతంగా చేసి ఆ తర్వాత అందరూ చల్లబడతారు.

కనుక ఆ తర్వాత ఆర్టీసీ బస్సులు మళ్ళీ యధాప్రకారం రోడ్లపైకి వస్తుంటాయి. కనుక నేడు కూడా అలాగే బంద్‌ జరుగుతుందని భావించిన అనేక మంది ప్రజలు, దీపావళి పండగకు ఊర్లు వెళ్ళేందుకు ఆర్టీసీ బస్టాండ్లకు వచ్చారు. 

కానీ ఎన్ని గంటలైనా ఒక్క బస్సు కూడా కదలలేదు. ఒక పార్టీ నేతలు హడావిడి చేసి వెళ్ళిపోగానే మరో పార్టీ నేతలు వచ్చి హడావుడి చేస్తుండటంతో టీజీఎస్ ఆర్టీసీ బస్సులు బయటకు తీయలేక పోయింది.

ఎదురుగా వందల బస్సులున్నా అవి ప్రయాణికులకు ఉపయోగపడలేదు. ఎదురుగా  వేలమంది ప్రయాణికులున్నా వారి ద్వారా వచ్చే ఆదాయాన్ని  టీజీఎస్ ఆర్టీసీ అంది పుచ్చుకోలేకపోయింది. 

బంద్‌ కారణంగా పండగకు ఊర్లు వెళ్ళాలనుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. టీజీఎస్ ఆర్టీసీ కూడా పండగ రద్దీ ఆదాయం కోల్పోయింది. శనివారం సాయంత్రం 5 గంటలవుతున్నా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ కొనసాగుతూనే ఉండటం విశేషం. కనుక రాత్రి 7 లేదా 8 గంటలకు ఆర్టీసీ బస్సులు బస్టాండ్లలో నుంచి బయటకు వస్తాయేమో?


Related Post