రామ్ చరణ్‌-సుకుమార్ సినిమా షూటింగ్‌ ఎప్పటి నుంచంటే...

October 18, 2025


img

రామ్ చరణ్‌-సుకుమార్ కాంబినేషన్‌లో రంగస్థలం సూపర్ హిట్. అల్లు అర్జున్‌-సుకుమార్ కాంబినేషన్‌లో పుష్ప-1,2 సూపర్ డూపర్ హిట్. కనుక రామ్ చరణ్‌-సుకుమార్ కాంబినేషన్‌లో అనుకున్న సినిమా కోసం సినీ ప్రియులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్‌ ‘పెద్ది’ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కాబోతోంది. కనుక పెద్ది పూర్తవగానే రామ్ చరణ్‌-సుకుమార్ సినిమా మొదలు పెడతామని మైత్రీ మూవీ మేకర్స్‌ అధినేతలలో ఒకరైన నవీన్ ఎర్నేని చెప్పారు.

వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలల మద్య ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభిస్తామని చెప్పారు. అది పూర్తి చేసిన తర్వాతే అల్లు అర్జున్‌తో సుకుమార్ పుష్ప-3 మొదలుపెడతారని నవీన్ ఎర్నేని స్పష్టం చేశారు. 

అల్లు అర్జున్‌ కూడా మరో ఏడాది వరకు కోలీవుడ్‌ దర్శకుడు అట్లీతో చేస్తున్న సినిమాతో బిజీగా ఉంటారు. కనుక అది పూర్తయ్యేలోగా రామ్ చరణ్‌తో సినిమా పూర్తిచేయాలని సుకుమార్ ప్లాన్ చేసుకున్నారు. 

ఇక పెద్ది సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే 60 శాతంపైగా షూటింగ్‌ పూర్తయింది. పెద్దిలో రామ్ చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ నటిస్తున్నారు. రామ్ చరణ్‌ గ్రామీణ క్రికెట్ ఆటగాడిగా నటిస్తుంటే, ఆయనకు కోచ్‌ గౌరు నాయుడుగా కన్నడ నటుడు శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. పెద్దిలో జగపతి బాబు, శివ రాజ్ కుమార్‌, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి అందిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష