రిజాజ్ మా అదుపులోనే ఉన్నాడు.. చనిపోలేదు: ఎస్పీ చైతన్య

October 19, 2025
img

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్‌ని అరెస్ట్‌ చేశామని నిజామాబాద్‌ ఎస్పీ చైతన్య చెప్పారు. రియాజ్‌ని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారని వస్తున్న ఊహాగానాలకు  ఆయన చెక్ పెట్టారు.

రియాజ్ తమ కస్టడీలోనే ఉన్నాడని స్పష్టం చేశారు. అయితే అతనిని అరెస్ట్‌ చేసే ముందు నిజామాబాద్‌ 6వ టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్‌ పరిధిలో సారంగపూర్ వద్ద అతనిపై ఆసిఫ్ అనే మరో వ్యక్తి దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించాడని, ఆ పెనుగులాటలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారని ఎస్పీ చైతన్య చెప్పారు.

ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని రియాజ్‌ని ఆస్పత్రికి తరలింఛి చికిత్స అందిస్తున్నామని ఎస్పీ చైతన్య చెప్పారు. అతనిపై దాడి చేసిన అసీఫ్ తప్పించుకొని పారిపోయినట్లు సమాచారం.

Related Post