పెద్ద కార్యక్రమం అందుకే శ్రీవారి దర్శనం: కవిత

October 19, 2025

img

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం మధ్యాహ్నం వరకు తెలంగాణ బంద్‌లో పాల్గొన్న తర్వాత సాయంత్రం తిరుమల చేరుకొని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.

ఆమెకు రేణిగుంట విమనాశ్రయంలో పలువురు శాలువాలు కప్పి సాదరంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “ఈ నెల 25 నుంచి నేనో పెద్ద కార్యక్రమం సంకల్పించుకున్నాను. నాలుగు నెలల పాటు సాగే ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని స్వామివారిని దర్శించుకున్నాను. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్ధించాను,” అని కల్వకుంట్ల కవిత చెప్పారు.

బీఆర్ఎస్‌ పార్టీ నుంచి బహిష్కరించినబడిన తర్వాత ఆమె  తన దారి తాను చూసుకోక తప్పలేదు. కనుక ఈ నెల 25 నుంచి సామాజిక తెలంగాణ సాధన కోసం ‘జాగృతి జనం బాట’ పేరుతో ఆమె రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పర్యటించబోతున్నారు. ఈ నాలుగు నెలల యాత్రతో తన రాజకీయ జీవితంలో మార్పు ఆశిస్తున్నారు. కనుక ముందుగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత - అనిల్ దంపతులు

ఈనెల 25 నుంచి తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమాన్ని సంకల్పించాను.. ఆ కార్యక్రమాన్ని విన్నవించుకునేందుకు ఇక్కడికి వచ్చాను.

తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు రెండూ సుభిక్షంగా,… pic.twitter.com/xUc7SKrjOM
— ChotaNews App (@ChotaNewsApp) October 19, 2025

(video courtesy: Chota app)

Related Post