డిసెంబర్‌ 25న శంభాలా విడుదల

October 19, 2025


img

ప్రముఖ నటుడు సాయి కుమార్‌ కుమారుడు ఆది హీరోగా నటిస్తున్న ‘శంభాల’ విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. డిసెంబర్‌ 25న శంభాలా విడుదల చేయబోతున్నట్లు ప్రకటిస్తూ ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ పోస్ట్ చేశారు. 

ఉగంధర్ ముని దర్శకత్వంలో సైన్స్, అతీంద్రియ శక్తుల నేపధ్యంతో  శంభాల తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌లో అదే చూపారు. టీజర్‌, దానిలో వాయిస్ ఓవర్‌తో చెప్పిన విషయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి.  

ఈ సినిమాలో అర్చన అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్వాశిక విజయ్, అన్నపూర్ణమ్మ, హర్షవర్ధన్, శివ కార్తీక్, శైలజ ప్రియ, చైత్ర, రామరాజు, రంగనాధం, శ్రావణ సంధ్య థియేటర్‌, మధునందన్‌, రవి వర్మ, మీసాల లక్ష్మణ్, శిజూ మీనన్ ముఖ్య పాత్రలు చేశారు. 

షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: శ్రీచరణ్ పాకాల, కెమెరా: ప్రవీణ్ కె బంగారి, ఎడిటింగ్: శ్రావణ్ కటికనేని, ఆర్ట్: జేకే మూర్తి, స్టంట్స్: రాజ్ కుమార్‌ చేస్తున్నారు. డిసెంబర్‌ 25న శంభాలా విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష