ప్రముఖ బాలీవుడ్ హాస్య నటుడు మృతి

October 21, 2025


img

ప్రముఖ బాలీవుడ్ హాస్య నటుడు గోవర్ధన్ అస్రానీ (84) ఇక లేరు. గత కొంత కాలంగా వ్రుదాప్య సంబందిత ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న అయన ముంబాయిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్న దీపావళి పండగ రోజు తుది శ్వాస విడిచారు.

గోవర్ధన్ అస్రానీ 1960లో బాలీవుడ్‌లో ప్రవేశించి సుమారు 350కి పైగా సినిమాలలో నటించారు. అమితాబ్ బచ్చన్, జయ బాధురి, ధర్మేంద్ర, హేమమాలిని కలిసి నటించిన సూపర్ డూపర్ హిట్ సినిమా ‘షోలే’లో గోవింద్ అస్రానీ జైలర్‌గా కొద్ది సేపు మాత్రమే కనిపించినప్పటికీ ఆ సినిమాలో ‘మై అంగ్రేజీ జమానా కా జైలర్ హై...’ అంటూ ఆయన చేసిన కామెడీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

బావర్చీ, చుప్కే చుప్కే, అభిమాన్ వంటి వందల సినిమాలలో నటించిన గోవర్ధన్ అస్రానీ ఉత్తరాది ప్రజల అభిమాన హాస్య నటులలో ఒకరు. ఆయన మృతిపట్ల బాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 



Related Post

సినిమా స‌మీక్ష