శర్వానంద్ సినిమా టైటిల్‌: బైకర్

October 21, 2025


img

శర్వానంద్ ఇప్పటి వరకు 35 సినిమాలు చేశారు. అలాగని ఏదో ఓ సినిమా చేసేయాలనుకోకుండా విభిన్నమైన కధ, పాత్రలతో సినిమాలు చేస్తున్నారు. నిన్న దీపావళి పండగ సందర్భంగా శర్వా 36వ సినిమా పేరు ‘బైకర్’ అని ప్రకటించారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ కృష్ణ రెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్ కలిసి ఈ సినిమా నిర్మించబోతున్నారు. 

‘బైకర్’ టైటిల్‌ పోస్టర్‌తోనే ఈ సినిమాలో శర్వా బైక్‌ రేసర్‌గా నటించబోతున్నారని స్పష్టం చేశారు. ఈ సినిమాలో శర్వాకు జోడీగా మాళవిక నాయర్ జంటగా నటించబోతున్నారు.        

ఈ సినిమాకు సంగీతం: గిబ్రన్; కెమెరా: జె యువరాజ్; ఎడిటింగ్: అనిల్ పాశాల; స్టంట్స్: దిలీప్ సుబ్రమణియన్; ఆర్ట్: ఏ పన్నీర్ సెల్వం చేస్తున్నారు. 



Related Post

సినిమా స‌మీక్ష