తెలంగాణలో ఇక చెక్ పోస్టులు ఉండవు

October 22, 2025


img

తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి అన్ని చెక్ పోస్టులను శాస్వితంగా మూసేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర రవాణాశాఖ కమేషనర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి వంటి నిషేదిత వస్తువులను అడ్డుకునేందుకు, సరుకు రవాణాలో అక్రమాలను అరికట్టేందుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేయబడ్డాయి.

కానీ ఆ చెక్ పోస్టులే అవినీతి అధికారులకు ఆదాయ మార్గాలుగా మారాయి. ఏసీబీ అధికారులు ఎప్పుడు చెక్ పోస్టులపై ఆకస్మిక దాడులు చేసినా భారీగా డబ్బు పట్టుబడుతుండటమే ఇందుకు నిదర్శనం.

ఇప్పటికే జీఎస్టీ అమలులో ఉంది కనుక సరుకు రవాణాపై నిఘా అవసరం లేదని దేశంలో పలు రాష్ట్రాలు చెక్ పోస్టులు ఎత్తివేశాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కూడా ఆ జాబితాలో చేరింది. దీనిపై సరుకు రవాణా, ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 


Related Post