రష్మిక మందన, దీక్షిత్ శెట్టి జంటగా చేస్తున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ ట్రైలర్ ఈ నెల 25న విడుదల కాబోతోంది. రావు రమేష్, రోహిణి తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో నవంబర్ 7న విడుదల కాబోతోంది.
ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్, కెమెరా: కృష్ణన్ వసంత్ చేస్తున్నారు.
అది విడుదల కాకముందే రష్మిక నటించిన తమ హిందీ సినిమా విడుదలైంది. అదీ, గర్ల్ ఫ్రెండ్ సినిమాలు చేస్తుండగానే రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్: 1గా తీయబోతున్న ‘మైసా’కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
చాలా కాలంగా ప్రేమించుకుంటున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందనల వివాహ నిశ్చితార్ధం ఇటీవలే హైదరాబాద్‌లో జరిగింది. కానీ విజయ్ దేవరకొండ కూడా వరుస సినిమాలో చాలా బిజీగా ఉన్నారు.
కింగ్‌డమ్ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా చేస్తున్నారు. అది చేస్తుండగానే ఇటీవల కిరణ్ కోలా దర్శకత్వంలో మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేశారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తన సొంత బ్యానర్ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించబోతున్నారు. కనుక వీరిద్దరూ ఈ సినిమాల మద్యలో ఎప్పుడు గ్యాప్ సంపాదించుకొని పెళ్ళి చేసుకుంటారో చూడాలి.