ఆస్తులు అమ్ముకుంటే దుబాయ్ ఎలా వెళ్ళగలం?

October 21, 2025


img

తెలుగు సినీ పరిశ్రమలో చాలా దూకుడుగా వ్యవహరించే నిర్మాతగా నాగ వంశీకి పేరుంది. ఆయన ఏం మాట్లాడిన వైరల్ అవుతుంటుంది. జూ.ఎన్టీఆర్‌, హృతిక్ రోషన్ హీరోలుగా తీసిన ‘వార్-2’ ఫ్లాప్ అవడంతో చాలా మంది తనని చాలా దారుణంగా ట్రోల్ చేశారని నాగ వంశీ చెప్పారు. 

మాస్ జాతర ప్రమోషన్స్‌లో భాగంగా రవితేజతో కలిసి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు, ఆ సినిమా పోగానే నేను ఆస్తులు అమ్ముకొని దుబాయ్‌ వెళ్ళిపోయానని పుకార్లు పుట్టించారు. అయితే నాకు అర్ధం కానిదేమిటంటే ఆస్తులు అమ్ముకునే పరిస్థితికి దిగజారితే హైదరాబాద్‌ వదిలి మా ఊరుకి వెళ్ళిపోయానని వ్రాస్తే బాగుండేది కానీ దుబాయ్‌ ఎలా వెళ్ళగలనని నన్ను ట్రోల్ చేసినవారు ఆలోచిస్తే బాగుండేది. దుబాయ్‌ ఏమైనా పక్కనున్న పల్లెటూరా వెళ్ళిపోవడానికి?” అని అన్నారు. 

‘వార్-2’ సినిమా గురించి మాట్లాడుతూ, నేను జూ.ఎన్టీఆర్‌ ఇద్దరం ఆదిత్య చొప్రాని, వారి సంస్థని నమ్ముకొని దెబ్బ తిన్నాము. ఇందుకు వారిని నేను తప్పు పట్టడం లేదు. సినీ పరిశ్రమలో ఎంత పెద్ద దర్శకుడు, నిర్మాణ సంస్థ అయినా ఒక్కోసారి ఇలా బోర్లా పడుతుంటుంది. ఇప్పుడూ అలాగే మిస్ ఫైర్ అయ్యింది. ఈసారి అయినప్పుడు మేము దొరికిపొయాము అంతే. 

మేమూ మనుషులమే. తెలిసో తెలియకో తప్పులు చేస్తుంటాము. వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటాము. కానీ అటువంటి సమయంలో ఇంతగా వేధించడం సరికాదు,” అని నాగ వంశీ అన్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష