ఇది ప్రముఖ నటి సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు ప్రేమాయణం గురించి. ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్ చేస్తున్న సమయంలో వారిద్దరి మద్య ప్రేమ మొదలైంది. సమంత ఇదివరకే నాగ చైతన్యతో విడిపోయారు. ఆయన మరో పెళ్ళి కూడా చేసుకున్నాడు. కనుక సమంత సైడ్ నుంచి ఈ ప్రేమకు ఎటువంటి సమస్య లేదనే భావించవచ్చు. కానీ రాజ్ నిడిమోరు వివాహితుడు.
ఆయన చాలా కాలంగా భార్యకు దూరంగా ఉంటున్నప్పటికీ చట్ట ప్రకారం ఇంకా విడాకులు తీసుకోలేదు. ఆ ప్రక్రియ ఇంకా మొదలు పెట్టారో లేదో... ఒకవేళ మొదలయ్యి ఉంటే ఏ దశలో ఉందో తెలీదు. కనుక రాజ్ నిడిమోరు చట్టబద్దంగా విడాకులు పొందితే తప్ప సమంతని వివాహం చేసుకోలేరు. ఈ విషయం వారిరువురికీ తెలియనిది కాదు. కానీ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. పెళ్ళికి కూడా సిద్దపడినట్లే ఉన్నారు.
ఇందుకు నిదర్శనంగా సమంత నిన్న దీపావళి పండుగను రాజ్ నిడిమోరు ఇంట్లో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవడమే. సినీ పరిశ్రమలో సెలబ్రిటీలు చిన్న పొరపాటు చేసినా లేదా పొరపాటున ఏదో మాట్లాడినా ఎంత రాద్దాంతం అవుతుంటుంది. కనుక సమంత, రాజ్ నిడిమోరు కలిసి దీపావళి పండగ జరుపుకోవడం అంటే ఆ రాద్ధాంతాన్ని శుభకార్యంగా మార్చే ఆలోచనలో ఉన్నట్లే అనిపిస్తుంది.