వెంకీ-త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్‌ శ్రీనిధి శెట్టి

October 21, 2025


img

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌  కాంబినేషన్‌లో సినిమా షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడీగా త్రిష, శ్రీనిధి శెట్టి, రుక్మిణీ వసంత్ పేర్లను పరిశీలించి చివరికి శ్రీనిధి శెట్టి పేరుని ఖరారు చేశారు. ఈరోజు ఆమె పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఆమె ఫోటో పెట్టింది తమ ప్రొడక్షన్ నం:8లోకి స్వాగతం పలికింది హారిక అండ్ హాసినీ క్రియేషన్స్. 

ఇది వెంకటేష్‌కు 77వ సినిమా కాగా వెంకటేష్‌, త్రివిక్రమ్‌ ఇద్దరూ కలిసి చేస్తున్న మూడవ సినిమా. గతంలో వెంకటేష్‌ నటించిన సూపర్ హిట్ సినిమాలు ‘నువ్వు నాకు నచ్చావ్,’ ‘మల్లీశ్వరి’ సినిమాలకు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ మాటల రచయితగా చేశారు. 

ఆ తర్వాత దర్శకుడుగా మారి అల్లు అర్జున్‌, పవన్‌ కళ్యాణ్‌, జూ.ఎన్టీఆర్‌, తదితరులతో అనేక హిట్స్ కొట్టారు. కనుక వెంకీ-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై చాలా భారీ అంచనాలున్నాయి. ఇటువంటి సినిమాలో శ్రీనిధి శెట్టికి ఛాన్స్ దక్కినందున ఆమె కెరీర్‌ మలుపు తిరుగబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష