రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా చేస్తున్న పెద్ది సినిమా దర్శకుడు బుచ్చిబాబు సనా నిన్న మీడియాతో మాట్లాడుతూ, “మరో 15-20 రోజుల్లో పెద్ది నుంచి ఓ లవ్ సాంగ్ విడుదలవుతుంది. పెద్ది షూటింగ్ 60 శాతం పూర్తయింది. మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజునాడు తప్పకుండా సినిమా విడుదలవుతుంది. ముందురోజు శ్రీరామ నవమి కనుక కుదిరితే ఒక రోజు ముందే విడుదల చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాము,” అని చెప్పారు.
ఈ సినిమాలో గ్రామీణ క్రికెట్ ఆటగాడిగా నటిస్తున్న రామ్ చరణ్‌కి కోచ్ గౌరు నాయుడుగా కన్నడ నటుడు శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు, శివ రాజ్ కుమార్, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి అందిస్తున్నారు.
వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు దీనిని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు.