నవీన్ పోలిశెట్టి దీపావళి ధమాకా మామూలుగా లేదు!

October 21, 2025


img

మారి దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’ సినిమా వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి పండుగకు విడుదల కాబోతోంది.

కనుక సినిమా ప్రమోషన్స్‌కి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ నవీన్ పోలిశెట్టి చేతికి అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. నిన్న దీపావళి పండగ సందర్భంగా టపాసుల దుకాణం పేరుతో ఓ అద్భుతమైన ప్రమో వదిలాడు. 

దానిలో ప్రధాని మోడీ మొదలు ఎలన్ మస్క్ వరకు అందరినీ వాడేసుకున్నాడు. పాకిస్తాన్‌ మీద వేసిన బాంబులు తన దుకాణంలో నుంచే వెళ్ళాయన్నాడు. కానీ గత దీపావళికి అమ్మిన బాంబులు పేలకపోతే... అవేమైన నిజమైన బాంబులా... జస్ట్ దీపావళి బాంబులు... పేలకపోతే లైట్ తీసుకోవాలి... అని సర్ది చెప్పాడు. 

ఈ బాంబులన్నిటి కంటే గొప్పగా ‘అనగనగా ఒక రాజు’ బాంబు బాగా పేలుతుందని, ఇందులో పాటలు, టీజర్, ట్రైలర్‌ అన్నీ మస్త్ ఉంటాయని నవీన్ పోలిశెట్టి చెప్పడం బాగుంది. ఈ ప్రమో గురించి వర్ణించడం కంటే మీరే స్వయంగా చూస్తే నవీన్ పోలిశెట్టి దీపావళి టపాసుల ప్రమో అద్భుతంగా పేలిందని అంగీకరిస్తారు.        

సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫర్ సినిమాస్ బ్యానర్లపై శ్రీకర స్టూడియోస్ సమర్పణలో నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మించిన ఈ సినిమాకు సంగీతం: మిక్కీ జే మేయర్; కెమెరా: జే.యువరాజ్ చేశారు. 


Related Post

సినిమా స‌మీక్ష