బ్లాక్ గోల్డ్ సంయుక్త ఫస్ట్ లుక్

October 22, 2025


img

భీమ్లా నాయక్, బింబిసార, విరూపాక్ష, డెవిల్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కేరళ భామ సంయుక్త అప్పుడే ‘బ్లాక్ గోల్డ్’ అనే హీరోయిన్ ఓరియంటడ్‌ సినిమా చేయబోతున్నారు. అదీ... పాన్ ఇండియా పాన్ ఇండియా మూవీ! దీపావళి పండగ సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల చేశారు. 

ఆమె ఫస్ట్ లుక్ అదిరిపోయింది. చేతిలో తుపాకీతో చుట్టూ శవాల మద్య రైల్వే ప్లాట్ ఫారం మీద నిలబడి ఉండగా ఆమె వెనుక ‘వెల్‌కమ్‌’ అని వ్రాసున్న అట్టముక్కని చేతిలో పట్టుకొని చనిపోయి వ్రేలాడుతున్న వ్యక్తి ఉన్నాడు. ప్లాట్ ఫారం పక్కనే ఆగి ఉన్న రైలు ఉంది. 

సినిమా పేరు బ్లాక్ గోల్డ్ అని పెట్టారు కనుక బొగ్గు గనుల మాఫియా నేపద్యంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు అనిపిస్తుంది. 

యోగేష్ కెఎంసి దర్శకత్వంలో హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాజేష్ దండ మాగంటి పిక్చర్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ యాక్షన్, థ్రిల్లర్ సినిమాని 5 భాషల్లో తెరకెక్కిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష