మాస్ జాతర నుంచి సూపర్ డూపర్ లిరికల్

October 22, 2025


img

మాస్ మహరాజ్ రవితేజ, డాన్సింగ్ క్వీన్ శ్రీలీల జంటగా చేసిన ‘మాస్ జాతర’ ఈ నెల 31న విడుదల కాబోతోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో నేడు ‘సూపర్ డూపర్ సాంగ్...’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. 

సురేష్ గంగుల వ్రాసిన ఈ పాటకి  భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించి రోహిణీ సొర్రత్‌తో కలిసి పాడారు.        

సినీ రచయిత భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, డైలాగ్స్: ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు.  

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి మాస్ జాతర నిర్మించారు. 

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/NXagITb11G4?si=ne7Obz7LifCLI7Jx" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

Related Post

సినిమా స‌మీక్ష