రాష్ట్రపతి ముర్ము కేరళ పర్యటనలో చిన్న అపశ్రుతి

October 22, 2025
img

రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ నేటి నాలుగు రోజులు కేరళలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం తిరువనంతపురం నుంచి హెలికాఫ్టర్‌లో ‘ప్రమదం’లో గల రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం చేరుకున్నారు.

ఆమె ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌పై ల్యాండ్ అయినప్పుడు దాని బరువుకి అది కొద్దిగా మట్టిలో క్రుంగింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆమెను భద్రంగా హెలికాఫ్టర్‌లో నుంచి బయటకు తీసుకురాగా ఆమె కారులో  పంబకు  బయలుదేరి వెళ్ళారు.  ఆమె ఈరోజు శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. 

ఆమె వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి కృంగిన హెలికాఫ్టర్‌ను పైకి లేపి సరిచేశారు. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం హెలికాఫ్టర్‌ పంబ సమీపంలో నీలక్కల్ వద్ద దిగాల్సి ఉంది.

కానీ అక్కడ వాతావరణం హటాత్తుగా మారడంతో పంబకు బదులు నీలక్కల్ వద్ద దిగేందుకు హెలీప్యాడ్ సిద్దం చేయాల్సి వచ్చింది. మంగళవారం రాత్రే హెలీప్యాడ్ తయారు చేయడంతో అది ఇంకా గట్టి పడలేదు. కనుక హెలికాఫ్టర్‌ బరువుకి కొద్దిగా క్రుంగింది. 

  


Related Post