జూబ్లీహిల్స్‌ బరిలో 58 మంది... మళ్ళీ అవే గుర్తులు!

October 26, 2025


img

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలు బరిలో నామినేషన్స్ ఉపసంహరణ ముగిసిన తర్వాత బరిలో 58 మంది మిగిలారు. వారిలో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా నవీన్ యాదవ్‌, బీజేపి అభ్యర్ధిగా లంకల దీపక్ రెడ్డి, బీఆర్ఎస్‌ అభ్యర్ధిగా మాగంటి సునీత కూడా ఉన్నారు. కానీ పోటీ ప్రధానంగా కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీల మద్యనే సాగబోతోంది. 

కానీ 58 మంది బరిలో ఉన్నారు కనుక ఎన్నికల సంఘం వారందరికీ కూడా గుర్తులు కేటాయించింది. వాటితో బీఆర్ఎస్‌ పార్టీకి మళ్ళీ అదే ఇబ్బంది నెలకొంది. 

స్వతంత్ర అభ్యర్ధులకు కేటాయించిన  రోట్ల పీట-కర్ర వంటి కొన్ని ఎన్నికల గుర్తులు ఇంచుమించు బీఆర్ఎస్‌ పార్టీకి చెందిన కారు గుర్తుని పోలి ఉండగా, రోడ్ రోలర్, షిప్, కెమెరా, టీవీ వంటి మరికొన్ని గుర్తులు ఓటర్లని గందరగోళం కలిగిస్తాయని బీఆర్ఎస్‌ పార్టీ ఎప్పటి నుంచో వాదిస్తోంది. 

అయినా జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలలో మళ్ళీ అవే గుర్తులు స్వాతంత్ర్య అభ్యర్ధులకు కేటాయించడంతో, ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు కారు గుర్తుకు మాత్రమే ఓట్లు వేయాలని బీఆర్ఎస్‌ పార్టీ అభ్యర్దిస్తోంది.


Related Post