ఆనంద్ రవి స్వీయ దర్శకత్వంలో రఘుబాబు, దివి వధ్య, ఆటో రామ్ ప్రసాద్, మీసాల లక్ష్మణ్, రాఘవేంద్ర తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్న ‘నెపోలియన్ రిటర్న్స్’ సినిమా టైటిల్ గ్లిమ్స్ నేడు విడుదల చేశారు. హర్రర్, థ్రిల్లర్, సస్పెన్స్, కామెడీ కలిపి దీనిని తీస్తున్నారు.
టైటిల్ గ్లిమ్స్‌తోనే సినిమాపై అందరికీ ఆసక్తి కలిగించారు దర్శకుడు ఆనంద్ రవి. దెయ్యం మీద పిర్యాదు చేయాలను ముగ్గురు యువకులు పోలీస్ స్టేషన్‌కు రావడం, ఆ దెయ్యం మనిషి కాదని గేదె దెయ్యమని చెప్పడంతో హర్రర్‌లో కామెడీని ఎంత చక్కగా మిక్స్ చేయవచ్చో అర్ధమవుతుంది. టైటిల్ గ్లిమ్స్‌లోనే ఇంత వెరైటీ చూపినప్పుడు ఇక నెపోలియన్ తిరిగివస్తే ఎలా ఉంటుందో అనిపించక మానదు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: ఆనంద్ రవి; సంగీతం: సిద్దార్థ్ సదాశివుని; కెమెరా: కార్తీక్ కొప్పెర; ఎడిటింగ్: విజయ్ వర్ధన్ చేస్తున్నారు.
వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై భోగేంద్ర గుప్తా ఈ సినిమా నిర్మిస్తున్నారు.