గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్‌… అద్భుతమైన కాన్సెప్ట్!

October 25, 2025
img

రష్మిక మందన, దీక్షిత్ శెట్టి జంటగా చేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ ట్రైలర్‌ ఈరోజు విడుదలయ్యింది. ఈ సినిమాలో రష్మిక ఉంది లేకుంటే ఎవరూ దీనిపై పెద్దగా ఆసక్తి చూపేవారు కారేమో? కానీ రష్మిక కంటే ఈ సినిమా కధ, కాన్సెప్ట్ చాలా గొప్పగా ఉన్నాయని చెప్పక తప్పదు. అలాంటి కధతో తీసిన ఈ సినిమాని రష్మిక తన నటనతో మరో స్థాయికి చేర్చబోతున్నారు. ట్రైలర్‌ చూస్తే అందరూ ఇది అంగీకరిస్తారు. 

ఇది మామూలు ప్రేమ కధ కాదు. నిజంగానే ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారా లేక ఒకరి ప్రేమ కోసం మరొకరు తన ఇష్టాలను చంపుకుంటూ సర్దుకుపోతున్నారా? అలా ఒకరు సర్దుకుపోతుంటే ఆ ప్రేమ అలాగే ఉంటుందా?వారు పెళ్ళి చేసుకున్నా సంతోషంగా జీవించగలరా? 

కాదని తెలిసినప్పుడు ఆమె ప్రేమ వద్దనుకుంటే ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయి?ఆ సమస్యలు, వేదన ఒక్కరివేనా లేదా ఇరు కుటుంబాలు కూడా వారి విఫల ప్రేమతో బాధ పడక తప్పదా?దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఇలాంటి చక్కటి పాయింట్స్ తీసుకొని వాటిని ‘ది గర్ల్ ఫ్రెండ్’గా మలిచి మన ముందుకి తెస్తున్నారు. 

రెండు నిమిషాల ట్రైలర్‌ మనసులు తాకేలా ఉంది. కనుక గంటన్నర సాగే సినిమాలో ఇంకా డెప్త్ ఉంటుంది. అందరినీ ఆలోచింపజేస్తుంది. కనుక ఈ సినిమాలో పాత్రలతో సమాజంలో ప్రతీ ఒక్కరూ కనెక్ట్ అవుతారు. అయితే సినిమా సూపర్ హిట్ అవుతుంది.                   

ఈ సినిమాలో రావు రమేష్, రోహిణి తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్, కెమెరా: కృష్ణన్ వసంత్ చేశారు. 

గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని కలిసి 5 భాషల్లో నిర్మించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ నవంబర్‌ 7న విడుదల కాబోతోంది. 

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/XgLlPN7oxwY?si=yRLrTGqKm76KZFgN" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

Related Post