మాస్ మహరాజ్ రవితేజ, డాన్సింగ్ క్వీన్ శ్రీలీల జంటగా చేసిన ‘మాస్ జాతర’ నుంచి మొన్న విడుదలైన ‘సూపర్ డూపర్ సాంగ్...’ అభిమానులను ఉర్రూతలూగించింది. అయితే అసలు మాస్ జాతర ఇప్పుడే మొదలుకాబోతోంది. సోమవారం మాస్ జాతర ట్రైలర్ విడుదల కాబోతోంది.
ప్రముఖ సినీ రచయిత భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, డైలాగ్స్: ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి మాస్ జాతర నిర్మించారు.