బాలకృష్ణ-మలినేని సినిమాకి ముహూర్తం ఖరారు

October 24, 2025


img

నందమూరి బాలకృష్ణ అఖండ 2: తాండవం పూర్తికాగానే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 111వ సినిమా మొదలు పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేశారు. ఈ నెల 24న పూజా కార్యక్రమం చేసి నవంబర్‌ నుంచి షూటింగ్‌ మొదలుపెట్టాలని అనుకున్నప్పటికీ అనివార్య కారణాల వలన కొంచెం ఆలస్యమైంది.

కనుక నవంబర్‌ 7న పూజా కార్యక్రమం నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు చాలా వరకు పూర్తయినందున నవంబర్‌ రెండో వారం నుంచి షూటింగ్‌ మొదలు పెట్టే అవకాశం ఉంది. 

వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించబోతున్న ఈ సినిమాకు ‘కాంతార’కు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ అరవింద్ ఎస్ కాశ్యప్ పనిచేయబోతున్నారు. సంగీత దర్శకత్వ బాధ్యతలు తమన్‌కి అప్పగించారు. ఈ సినిమా కధ రెండు వేర్వేరు కాలాలలో జరుగుతుంది. కనుక ఇది టైమ్‌ ట్రావెల్ సినిమా అని భావించవచ్చు.


Related Post

సినిమా స‌మీక్ష