ప్రభాస్ అభిమానులకు పండగే... ఒకే రోజు రెండు పోస్టర్స్

October 23, 2025


img

నేడు డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజు. కనుక అభిమానులకు ప్రభాస్ పుట్టినరోజు కానుకగా నేడు ఒకే సరి రెండు సినిమా పోస్టర్స్ విడుదల చేశారు. మారుతి దర్శకత్వంలో చేస్తున్న రాజసాబ్, హనురాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమా పేరు ఫౌజీ అని ఖరారు చేస్తూ ఓ పోస్టర్‌ నేడు విడుదల చేశారు. 

వీటిలో రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ పాటకు సంబందించి పోస్టర్‌ కాగా, ఫౌజీ పీరియాడికల్ యాక్షన్ మూవీ కనుక అందుకు తగినట్లుగానే “అతను పద్మవ్యూహాన్ని చేధించిన అర్జునుడు... పాండవుల పక్షాన్న ఉన్న కర్ణుడు... గురువులేని ఏకలవ్యుడు... పుట్టుకతోనే యోధుడు... మన చరిత్రలో దాగిన అధ్యాయాల్లోని అత్యంత ధైర్యవంతుడైన ఓ సైనికుడి కధ ఇది. అతడే ఈ ఫౌజీ,” అంటూ ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర గురించి అద్భుతంగా వర్ణించారు. పోస్టర్‌లోనే ఇన్ని ఎలివేషన్స్ చూసి అభిమానులకు సంతోషంతో ఉప్పొంగిపోకుండా ఉంటారా?

రాజాసాబ్‌లో ప్రభాస్‌కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించగా, ఫౌజీలో ప్రభాస్‌కు జోడీగా కొత్త హీరోయిన్‌ ఇమాన్వీ నటిస్తోంది. 

రాజాసాబ్‌, ఫౌజీ రెండూ 5 భాషల్లో పాన్ ఇండియా మూవీలుగానే రాబోతున్నాయి. రాజాసాబ్ జనవరి 9న సంక్రాంతి పండగకు ముందు రాబోతుండగా, ఫౌజీ రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. 



Related Post

సినిమా స‌మీక్ష