నే వచ్చేస్తున్నా... అందరూ రెడీయేనా?

October 23, 2025


img

ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ జూ.ఎన్టీఆర్‌తో ‘టెంపర్’ తీసి హిట్ కొట్టిన తర్వాత హటాత్తుగా సినీ పరిశ్రమకు దూరమయ్యాయి. కానీ మళ్ళీ తాను వచ్చేస్తున్నానని ఆయన స్వయంగా చెప్పారు.

జొన్నలగడ్డ సిద్ధూ నటించిన ‘తెలుసు కదా?’ సక్సస్ మీట్‌లో బండ్ల గణేశ్ మాట్లాడుతూ, “నేను టెంపర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్‌ తర్వాత బ్రేక్ తీసుకున్నాను తప్ప ఫ్లాప్ సినిమాతో కాదు. నిర్మాత ఎస్కేఎన్ నన్ను మళ్ళీ సినీ పరిశ్రమలోకి రావాలని కోరారు. ఆయన మాట కాదనడానికి నాకు కారణం ఏమీ కనపడలేదు. కనుక త్వరలోనే సినీ పరిశ్రమలోకి తిరిగి వస్తున్నాను. అందరూ రెడీయే కదా?” అన్నారు. 

బండ్ల గణేశ్ హాస్య నటుడిగా చేసిన కామెడీ అందరికీ నచ్చేది. కనుక మంచి హాస్య నటుడుగా బండ్ల గణేశ్ పేరు సంపాదించుకున్నారు. కానీ నిర్మాతగా మారి కొన్ని హిట్స్ కొట్టిన తర్వాత ఆయన మాట తీరులో తేడా వచ్చింది.

ఆ తర్వాత అదే ఊపులో రాజకీయాలలో ప్రవేశించినప్పుడు మాట్లాడిన మాటలు బెడిసి కొట్టాయి. ఆ కారణంగా రాజకీయాలలో రాణించలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు సినీ పరిశ్రమలోకి తిరిగి వస్తున్నందుకు చాలా సంతోషమే. కానీ రీ-ఎంట్రీ గురించి ఆయన మాట్లాడిన తీరు చూస్తే లోపల అదే ‘టెంపర్’ ఇంకా ఉన్నట్లే అనిపిస్తోంది.

సినీ పరిశ్రమ అందరూ కలిసి మెలిసి పనిచేసుకొనే వేదికే తప్ప యుద్ధాలు చేసుకునే వేదిక కాదు కదా? దిల్ రాజు, టీజీ విశ్వప్రసాద్‌  చక్కటి సినిమాలు తీసి తక్కువ మాట్లాడితే చాలు. ఆ సినిమాలేఆయన గౌరవాన్ని పెంచుతాయి. ఆయన గొప్పదనం అందరూ గుర్తించేలా చేస్తాయి కదా? 


Related Post

సినిమా స‌మీక్ష