గుమ్మడి నరసయ్యగా వస్తున్న శివరాజ్ కుమార్‌

October 23, 2025


img

ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్ కుమార్‌ ‘గుమ్మడి నరసయ్య’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల చేశారు. తెలంగాణలో ఇల్లెందు నియోజకవర్గం నుంచి వరుసగా 5సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రముఖ సీపీఐ నాయకుడు గుమ్మడి నరసయ్య. ఆయన 5సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ అత్యంత నిరాడంబరంగా జీవిస్తుంటారు. అయన జీవితగాధ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.      

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అసెంబ్లీ భవనం ముందు భుజంపై ఎర్ర కండువా, ఎర్ర జెండా తగిలించిన సైకిల్ పట్టుకొని నడుస్తున్న గుమ్మడి నరసయ్యగా శివరాజ్ కుమార్‌ని చూపారు.

ఈ సినిమాకి సంగీతం, ఎడిటింగ్: సురేష్ బొబ్బిలి, కెమెరా: సతీష్ ముత్యాల చేస్తున్నారు. పరమేశ్వ హివర్లె దర్శకత్వంలో ప్రవళిక ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నం:1గా ఎన్‌ సురేష్ రెడ్డి ఈ సినిమాని 5 భాషల్లో తెరకెక్కిస్తున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష