రామ్ చరణ్, ఉపాసన దంపతులు మరోసారి తల్లితండ్రులు కాబోతున్నారు. ఈ వార్త నిన్ననే మీడియాకు లీక్ అయినప్పటికీ నేడు అధికారికంగా బయటకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి దంపతులు, ఉపాసన తల్లితండ్రులు, ఇరు కుటుంబ సభ్యులు అందరూ తరలివచ్చి ఉపాసనను దీవించారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులను అభినందించారు.
రామ్ చరణ్, ఉపాసన దంపతుల కుమార్తె ‘క్లింకార’కు ఇప్పుడు సుమారు రెండేళ్ళు. కనుక రామ్ చరణ్ దంపతులు సరైన సమయంలోనే మరో బిడ్డని తమ కుటుంబంలోకి తేబోతున్నారు. ఈసారి తప్పకుండా మెగా వారసుడు పుడతాడని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.
Global Star @AlwaysRamCharan and @upasanakonidela are becoming proud parents again pic.twitter.com/m8GsC87rVG
— TrackTollywood (@TrackTwood) October 23, 2025