ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో నేటి నుంచి రాబోయే మూడు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతీ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడి, ఈరోజు ఉదయం 5.30 గంటలకు తమిళనాడు సమీపంలో తీరం దాటి దక్షిణ కర్ణాటకలో ప్రవేశించింది.
దానికి తోడూ ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడి క్రమంగా విస్తరిస్తోంది. కనుక రాబోయే మూడు రోజులలో రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు పడతాయని తెలిపింది. వర్షంతో పాటు గంటకు 30-40 కిమీ వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని కనుక ప్రజలు, జిల్లా అధికారులు, సహాయ సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
ఇప్పటికే హైదరాబాద్‌తో సహా తెలంగాణలో పలు జిల్లాలలో మళ్ళీ వర్షం మొదలైంది. రాబోయే మూడు రోజులలో ఈ వర్షాలు మరిన్ని జిల్లాలకు విస్తరిస్తాయి. కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండటం చాలా మంచిది.