అప్పుల ఊబిలో దేశ ప్రజలు... ఎందువల్ల?

October 23, 2025
img

కేంద్ర గణాంకాల శాఖ 2020-21 నివేదిక ప్రకారం దక్షిణాది రాష్ట్రాలలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఏపీలో 43.7 శాతం మంది, తెలంగాణలో  37.2 శాతం మంది అప్పుల ఊబిలో కూరుకుపోయారని వెల్లడించింది. అంటే ఏపీలో దాదాపు సగం మంది, తెలంగాణలో సగానికి కాస్త తక్కువగా అప్పుల ఊబిలో కూరుకుపోయారన్న మాట! ఈ గణాంకాలు ఇప్పటివి కూడా కావు. 2020-21 నాటివి. ఈ నాలుగైదేళ్ళలలోనే ధరలు, ఛార్జీలు, పన్నులు చాలా పెరిగిపోయాయి. 

ఓ పక్క దేశంలో రాన్రాను నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంటే, మరోపక్క యుద్ధాలు, ట్రంప్‌ ఆంక్షలు, ఏఐ టెక్నాలజీ, చైనా మాల్ డంపింగ్ వంటి పలు కారణాల వలన లక్షల మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోతున్నారు. అయినా కుటుంబ పోషణ, ఖర్చులు, ధరలు, పన్నులు, ఛార్జీలు ఏవీ తగ్గవు. అన్నీ పెరుగుతూనే ఉంటాయి. పైగా ఉద్యోగాలలో ఉన్నప్పుడు తీసుకున్న ఇంటి, వాహన రుణాల వంటివి తలపై కత్తిలా వ్రేలాడుతూనే ఉంటాయి. కనుక సామాన్య ప్రజలు మొదలు లక్ష రెండు లక్షలు సంపాదించేవారు వరకు ప్రతీ ఒక్కరూ అప్పులు చేస్తూనే ఉన్నారు. ఈ ఊబిలో కూరుకుపోతూనే ఉన్నారు.

కేంద్ర గణాంకాల శాఖ 2020-21 నివేదిక ప్రకారం... ఏపీలో 43.7 శాతం, తెలంగాణలో 37.2 శాతం, కేరళలో 29.9 శాతం, తమిళనాడులో 29.4 శాతం, కర్ణాటకలో  23.2 శాతం మంది ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. 

Related Post