నిన్న విశాల్, నేడు యష్... దర్శకత్వం

October 23, 2025


img

మన సినీ పరిశ్రమలో సినీ రచయితలు దర్శకులుగా మారుతున్నారు. సంగీత దర్శకులు నటులుగా మారుతున్నారు. నటులు దర్శకులుగా మారుతున్నారు. అందరూ నిర్మాతలుగా మారి సినిమాలు తీస్తున్నారు కూడా. అయితే ఇవేమీ కొత్త కాదు ఎప్పటి నుంచో జరుగుతున్నవే. కానీ ఇప్పుడు సినిమా బడ్జెట్‌ కనీసం వంద కోట్లు.. అదీ దాటిపోతోంది వీరందరూ ఆ ‘రిస్క్’ తీసుకునేందుకు సిద్దపడుతున్నారు కనుకనే ఈ మార్పులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయని చెప్పవచ్చు. 

రవి అరసు దర్శకత్వంలో విశాల్ హీరోగా ‘మకుటం’ సినిమా చేస్తున్నప్పుడు వారిద్దరి మద్య అభిప్రాయ భేదాలు ఏర్పడటంతో ఈ సినిమా మద్యలో రవి అరసు తప్పుకున్నారు. దాంతో విశాల్ దర్శకుడుగా మారి ఈ సినిమా పూర్తి చేశారు. 

ఇప్పుడు ప్రముఖ కన్నడ నటుడు యష్ కూడా తన ‘టాక్సిక్’ సినిమా షూటింగ్‌ విషయంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్‌తో అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయి. సినిమా ఫుటేజ్ చూసిన యష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. కనుక యష్ దర్శకుడుగా మారి ఈ సినిమాలో చప్పగా ఉన్న సన్నివేశాలన్నీ తొలగించి మళ్ళీ కొత్తగా రీషూట్ చేస్తున్నట్లు తాజా సమాచారం. 


Related Post

సినిమా స‌మీక్ష